Dr. BRA Konaseema: ఒక్కఅవకాశం ఇవ్వండి అవినీతి రహిత సమాజం నిర్మిస్తా అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో ప్రజలును కలిసి విజల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అడుగు అడుగునా మహిళలు హారతులతో శ్యామ్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు.
చేనేత కార్మికులు, ఓలుపు కార్మికులను కలిసి టిడిపి పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఒక అవకాశం ఇచ్చి ఓటు వేసిగెలిపించాలని అమలాపురం నియోజకవర్గాని అభివృద్ధి బాటలో నడిపిస్తానని శ్యామ్ కుమార్ తెలిపారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నిక బ్యాలెట్ నమూనా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బుడ్డిగా శ్రీను, శివగంగ శ్రీను, ఇంటూపల్లి నాగబాబు, తోత్తరముడి సాయి, నుటుకుర్తి దుర్గారావు జాంగా బుజ్జి, గుత్తుల కృష్ణ, తొత్తరముడి నాగేశ్వరరావు, నందుల సత్య నాయడు, బడుగు చందు, పరమట భీమమహేష్, జిత్తుక సచిన్, నక్కా బాలనాగ సురేష్, యళ్ల సత్యనారాయణ, పరమట నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.