డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: స్థానిక అమలాపురం ఆర్టీసీ డిపోకు సమీపంలో గల జన కళ్యాణ్ కార్యాలయ ఆవరణములో జల్లి సుజాత, మెండి కమల, జన కళ్యాణ్ సంస్థ మేనేజర్ శ్రీనివాస్, గొల్లపల్లి గోపి ఆధ్వర్యంలో సమాజ సేవాకర్త, పరం కంప్యూటర్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యడ్ల సురేష్ కుమార్ కు ఘన సన్మాన సత్కారం జరిగింది. ఇటీవల కాలంలో శ్రీ రజిత మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అమలాపురంలో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమలాపురం జన కళ్యాణం సంస్థ కార్యాలయంలో ఎడ్ల సురేష్ కుమార్ ను ఆహ్వానించి ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా జన కళ్యాణం సంస్థ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ యడ్ల సురేష్ కుమార్ గత పది సంవత్సరాల నుంచి అమలాపురంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, మా సంస్థ కు, ఆయన మాకు ఎంతో సహకారంగా ఉంటారని అన్నారు. ప్రముఖ సేవాకర్త సాయి సంజీవిని మహిళా నడక యోగ ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షురాలు జల్లి సుజాత మాట్లాడుతూ యడ్ల సురేష్ కుమార్ చిన్నతనము నుండి నాకు బాగా తెలుసు అని, ఆయన అమలాపురంలో మంచి సేవాతత్వం గల వ్యక్తి అని, గత 24 సంవత్సరాల నుండి అమలాపురంలో పరం కంప్యూటర్ విద్య సంస్థ స్థాపించి విద్యా సంస్థ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పించి అనేకమంది విద్యార్థులను నేటికీ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులుగా తీర్చి దిద్దిన గొప్ప వ్యక్తి ఎడ్ల సురేష్ కుమార్ అని, ఈరోజు శ్రీ రజిత మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సురేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపిక కావడం పట్ల సభాముఖంగా అభినందిస్తున్నామని ఆమె అన్నారు.
రాష్ట్ర అంగన్వాడి డ్వాక్రా సాధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల మాట్లాడుతూ యడ్ల సురేష్ కుమార్ విశ్వజనా కళా మండలిలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతు తన సేవలను అందిస్తున్నారని, ఇప్పుడు నూతనంగా శ్రీ రజిత మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక కావటం మేము గర్వంగా భావిస్తున్నామని ఆమె సురేష్ కుమార్ ని కొనియాడారు. గొల్లపల్లి గోపి మాట్లాడుతూ సురేష్ కుమార్ కి జిల్లాలోని రాష్ట్రంలో గాని, ఏ రంగంలో అయినా ఏ పదవి ఇచ్చిన చిత్తశుద్ధితో పనిచేసే గొప్ప వ్యక్తి అని నేడు శ్రీ రజిత మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా మేము చూడటం ఆనందపడుతున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పొంది అనేకమందికి, అనేక రంగాలలో సేవలు అందజేయాలని ఆయన ఆకాంక్షించారు.
సన్మాన గ్రహీత యడ్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ... అమలాపురం జన కళ్యాణ్ సంస్థకి, మరియు జల్లి సుజాతకి, కమలకి, గోపికి, మేనేజర్ శ్రీనివాస్ కు మరియు ఆఫీస్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని, సామాజిక సేవ విభాగంగా నేను అమలాపురంలో ఉన్న జన కళ్యాణ్ సంస్థకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని, ఆయన హామీ ఇచ్చారు. నేను జిల్లాలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఏ పదవిలో కొనసాగుతున్న నేను మీకు సంబంధించిన వాడనని , జల్లి సుజాత, మెండి కమల, గొల్లపల్లి గోపి, సంస్థ మేనేజర్ శ్రీనివాస్ లాంటివారు గొప్ప సమాజం సేవా మనస్తత్వం కలవారని, వారితో కలిసి నేను ఉండటం ధన్యతగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం జన కళ్యాణం కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.