ఏలూరు, నవంబర్, 23: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 24 తేదీ అనగా ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు ఆదేశించారు. అర్హులైన వారు 6,7, 8 దరఖాస్తు పారములను పూర్తీ చేసి ఇచ్చిన వాటిని స్వీకరించాలన్నారు. ఓటర్ల నమోదు అధికారులు, తహశీల్దారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి సజావుగా శిబిరం నడుస్తుందో లేదో పరిశీలించాలని ఆదేశించారు. బి.యల్.ఓ.లు స్వీకరించిన ఫారం 6,7, 8 దరఖాస్తుల నివేదికను అదేరోజు సాయంత్రం 5.00 గంటలకు సంబంధిత తహశీల్దార్లు సమర్పించాలన్నారు.