కూటమి ప్రభుత్వంపై బొత్సా కీలక వ్యాఖ్యలు..!!


ANDHRAPRADESH:శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్సా సత్యానారయణ కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభు త్వాన్ని టార్గెట్ చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తం అయ్యాయని ఆరోపించారు. అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. రైతులను అత్యంత అసభ్యకరంగా, హేళన చేస్తూ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడడంపై బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకం పైన తమ పార్టీ పోరాటం కొన సాగిస్తుందని బొత్సా వెల్లడించారు.

మాజీ మంత్రి బొత్సా కూటమి ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కోసం మాజీ సీఎం జగన్ పరామర్శకు వెళ్తే అప్పుడు రైతుల తరపున ఢిల్లీకి వెళ్లాలన్న విషయం చంద్రబాబుకు వారి మంత్రులకు తెలిసిందన్నారు. అదే విధంగా జగన్ మిర్చియార్డుకు వెళ్లిన తర్వాత మరలా ఢిల్లీకి వెళ్లారన్నారు. మద్ధతు ధర ఇస్తాం... రూ.11 వేలకు టన్ను కొంటామ ని ప్రకటించి... ఒక కిలో కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు. కోకో, ఆక్వా ఇలా అన్ని రకాల పంటలకు ధర లేదని బొత్సా మండిపడ్డారు. మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని కేబినెట్ లో ముఖ్యమంత్రే మాట్లాడుతున్నారన్న వార్తలు పత్రికల్లో చూస్తున్నామన్నారు. మేం స్పష్టంగా చెబుతున్నాం.

ఇసుక, మట్టి, మద్యం దోపిడీ, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలకు తెరతీస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవ లం ఏడాది కాలంలోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు. కూటమి నేతల మాయమాటలు విని ప్రజలు మోసపోయారని బొత్సా పేర్కొన్నారు. అభివృద్ధిలో కాదు డ్రగ్స్ లో వైజాగ్ అంతర్జా తీయ నగరంగా మార్చేసారని బొత్సా ఘాటు వ్యాఖ్యలు చేసారు. తాము అధికారంలోకి వస్తే గంజా యి పై ఉక్కుపాదం, తీవ్ర చర్యలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. ఇప్పుడు గంజాయికి తోడు గతంలో కనీవినీ ఎరగని విధంగా విశాఖపట్నంలో ఇప్పుడు డ్రగ్స్ సంస్కృతి కూడా ప్రవేశిం చిందని పేర్కొన్నారు. విశాఖ భూముల వ్యవహారంపై వేసిన సిట్ రిపోర్టును బయట పెట్టమని తాను గతంలో కూడా లేఖ రాశానని గుర్తు చేసారు. ఏడాదిగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని చెప్పిన బొత్సా.. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now