పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ తేదీ ఖరారు: లాస్ట్ ఛాన్స్, దక్కేది వీరికే..!!

కేంద్రం- ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధుల జమ తేదీ ఖరారైంది. కేంద్రం 20వ విడత పీఎం కిసాన్ పథకం నిధుల తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను సమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన రైతులను గుర్తించింది. వారి జాబితాలను ఖరారు చేసింది. అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవటానికి రేపు (13వ తేదీ) చివరి రోజుగా ప్రకటించింది. ఇక.. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద రూ 2 వేలు.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ 5 వేలు ఒకే రోజు జమ కానుంది.

ఒకే సారి రూ 7 వేలు

ఏపీ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయాలని నిర్ణయించింది. ఏడాదిలో మూడు సార్లు కేంద్రం పీఎం కిసాన్ కింద రూ 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం అదే విధంగా పీఎం కిసాన్ తో పాటుగా మూడు సార్లుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. గత నెలలోనే ఈ నిధులను విడుదల చేస్తారని భావించారు. అయితే, పీఎం కిసాన్ అమలు కోసం వేచి చూసారు. ఇక, ఈ నెల 21న పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం నిర్ణయించటంతో.. ఏపీ ప్రభుత్వం సైతం అదే రోజున అన్నదాత సుఖీభవ నగదు విడుదల చేయనుంది. ఈ రెండు పథకాల ద్వారా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి.

అర్హుల జాబితా సిద్దం

రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు సేవా కేంద్రాల్లో ఈ జాబితాలు అందుబాటులో ఉంచారు. ఎవరైనా రైతులకు అభ్యంతరాలు ఉంటే.. అర్హత ఉండీ పేరు లేకపోతే అక్కడి సిబ్బందికి అర్జీతో పాటుగా అర్హత ఉందని నిర్ధారణ చేసే పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు. ఇందుకు ఈ నెల 13వ తేదీ చివరి రోజుగా పేర్కొన్నారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ మాడ్యూల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. పథకానికి అర్హత సాధించాలంటే ఈకేవైసీ కీలకం. తమ వివరాలు నమోదు చేయించుకుని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసినవారికే లబ్ధి చేకూరుతుంది.

చెక్ చేసుకోండి 

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితాను రైతులు..పరిశీలనతో పాటుగా వివరాలు నమోదు కోసం www.annadatasukhibhava.ap.gov.in లో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ యాప్ లోనూ వివరాలు అందుబాటులో ఉంచారు. ఇక.. ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. ఇక, తాజా నిర్ణయం మేరకు ఈ నెల 21న పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతు కుటుంబాలకు సాయం అందనుంది. అయితే, తుది జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ నిధులు అందే అవకాశం కనిపిస్తోంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now