అయితే.. ఈ వ్యవహారంపై కొందరు నాయకులు .. కీలక చర్చ తెచ్చారు. జగన్ కాకుండా ఆయన సతీమణి భారతి రంగంలోకి దిగితే ప్రయోజనం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
ANDHRAPRADESH:వైసీపీ నాయకుల్లో కీలక చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు తాను మరోసారి పాదయాత్ర చేస్తానని జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా.. జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంపై కొందరు నాయకులు .. కీలక చర్చ తెచ్చారు. జగన్ కాకుండా ఆయన సతీమణి భారతి రంగంలోకి దిగితే ప్రయోజనం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
సింపతీ గెయిన్ చేసేందుకు గతంలో విజయమ్మ, సోదరి షర్మిల ప్రయత్నించిన విషయాన్ని వారు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆ తరహాలో వైసీపీ పుంజుకునేందుకు భారతి రంగంలోకి దిగితే బెటర్ అనేది వారి ఆలోచన. దీనిపై పార్టీలో కీలక నాయకులు, సీనియర్ నేతలు కూడా చర్చిస్తున్నారు. గతంలో జగన్ ఓదార్పు యాత్రలు, పాదయాత్ర చేశారని.. వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వైసీపీ ముందుకు సాగితే.. పెద్దగా ఆకర్షణ ఉండబోదని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కొత్త ఫేస్ అయితే.. బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. తద్వారా.. మహిళలను, వారి ఓటు బ్యాంకును కూడా వైసీపీ దరిచేర్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. దీనికి భారతి ఒప్పుకొంటారా? అనే సందేహాలు కూడా వారే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యేకంగా మీడియా ముందుకు రాలేదని అంటున్నారు. అయితే.. పులివెందులలో మాత్రం ఎన్నికల సమయంలో పర్యటించారని అంటున్నారు.
పైగా పబ్లిక్ మీటింగులు సహా.. మీడియా ముందుకు భారతి ఎప్పుడూ రాలేదు. పెద్దగా విమర్శలు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు దిగడం ద్వారా ప్రజల మధ్యకు రావడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల ఆమె ప్రజలకు చేరువ అవుతారని చెబుతున్నారు. తద్వారా పార్టీ పుంజుకునేందుకు ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా జగనే పాదయాత్ర చేస్తే.. గతంలో వచ్చినంత ఇమేజ్ కానీ.. ఓటు బ్యాంకు కానీ.. వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నది సీనియర్లు చెబుతున్న మాట.

Shakir Babji Shaik
Editor | Amaravathi