తిరుపతికి మరో వందేభారత్, నాలుగున్నార గంటల్లోనే - రూట్..షెడ్యూల్ ఖరారు..!!


ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే నడుస్తున్న వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, కొత్తగా మరో వందేభారత్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ కొత్త రైలును విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్‌ ట్రైన్ నడిపేందుకు నిర్ణయించారు. తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్లేలా రూట్ ఖరారు చేసారు. ఈ రైలుకు కొద్ది నెలల క్రితమే ఆమో దం దక్కినా.. ఆలస్యం అయింది. ఇప్పుడు కదలిక వచ్చింది. ఈ రైలు ద్వారా కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు.. నాలుగున్నార గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు.

9 గంటల్లో బెంగళూరుకు 

విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే అధికారులు మే నెలలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, కోచ్ లు సమస్య కారణంగా రైలు ఆలస్యం అయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైలు పట్టాలెక్కిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది.

నాలుగున్నార గంటల్లో తిరుపతికి 

కాగా, ఈ రైలుకు నెంబర్ తో పాటుగా రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు అందు బాటులోకి రావటం ద్వారా తిరుపతి.. బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now