ANDHRAPRADESH:తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచారు ప్రకాష్ రాజ్. విలక్షణ నటనకు ప్రసిద్ధి చెందిన ఆయన.. నెగటివ్, కారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రశంసలు పొందారు. అంతే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయిన ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాశ్ రాజ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు
ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి పవన్ పై.. ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఛీ ఛీ ఈ రేంజ్ కి అమ్ముకోవడమా అంటూ కామెంట్స్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అందుకు జనసేన పార్టీ సైతం ఆయనకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ గానే కాకుండా సినీ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
శుక్రవారం ( జూలై 11, 2025 ) నాడు రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యి.. హిందీ భాష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ భాష పెద్దమ్మ అని.. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని అన్నారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని.. కలిసి ప్రయాణం చేయడమని తెలిపారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi