పీజీలో చేరిన తర్వాత అక్కడ ఉన్న అరాకొర సదుపాయాలపై ప్రశ్నించిన అమ్మాయిలను ఆ పీజీ యజమాని బెదిరించిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ప్రశ్నించినందుకు సమాధానం చెప్పకుండా ఆ పీజీ యాజమాన్యం గూండాల్లా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లే అవుట్‌లోని ప్రేమ అనే పీజీలో ఈ ఘటన చోటుచేసుకుందని బాధిత మహిళలు వీడియోలో ఆరోపించారు.
ప్రేమ పీజీలో పీజీకి వచ్చిన యువతులు ఈ గొడవతో విసిగిపోయి ఇప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. పీజీలో ఎక్కడ చూసినా దోమలు ఉన్నాయని, తినే తిండిలో పురుగులు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయని, తాగేందుకు మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవని ఆ పీజీల్లోని అమ్మాయిలు ఆరోపించారు. ఇదే సమయంలో ఆ ప్రేమ పీజీ యువతులు ఆ దారుణానికి సంబంధించిన వీడియోను తీసి దానిని వైరల్ చేశారు.
మహాలక్ష్మి లేఔట్ లోని బోవిపాళ్యలో ప్రేమ పీజీలో గందరగోళం నెలకొని గొడవ జరిగిందని వీడియోలో స్పష్టంగా తెలిసింది. పీజీ చూసుకునే కల్పనా ఆంటీ కర్రలతో ఆ పీజీలో నివాసం ఉంటున్న అమ్మాయిలను బెదిరిస్తున్న సమయంలో కొందరు అమ్మాయిలు వీడియో తీశారు. ఇదే సమయంలో అదే పీజీలో ఉంటున్న కొందరు యువతులు ఆ వీడియోలో పలు ఆరోపణలు చేశారు. ఈ పీజీ మహాలక్ష్మి లేఔవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అయితే ఇంత వరకు పీజీ యాజమాన్యంపై యువుతులు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారని కన్నడ మీడియా తెలిపింది.