అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా .. పవన్ 2.O చూపిస్తున్నారా ?


ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2. O చూపిస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి, సనాతన ధర్మం అంటూ ఆ విషయాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన పవన్.. ఇప్పుడు రూట్ మార్చినట్టు కనిపిస్తుంది. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు ఫినిష్ చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఛాన్స్ దొరికిన్నప్పుడు మాత్రం తగ్గేదే లే అంటూ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు.

అంతకు ముందు పుష్ప 2 సినిమాలోని డైలాగ్‌ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని.. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని హెచ్చరించారు.

అలానే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని.. ఇప్పటికే పోలీసులకు తగిన దిశానిర్దేశం ఇచ్చామని అన్నారు. జగన్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో ప్రజలు గుర్తించాలని పవన్ పేర్కొన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమేనని.. ఇది ఎవ్వరూ మరచిపోవద్దని పవన్ అన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టమని.. అలాంటి వారిపై కచ్చితంగా రౌడీ షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు.

ఇక ఇప్పుడు.. ప్రకాశం జిల్లా నరసింహపురంలో రూ.1,290 కోట్లతో ఏర్పాటు చేయనున్న రక్షిత తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సగటు మనిషిని భయపెట్టడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now