గంజాయి చాకొలేట్ & గంజాయి పౌడర్ ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు


హైదరాబాద్: విశ్వసనీయ సమాచారం మేరకు SOT మాదాపూర్ టీం & జగత్ గిరి గుట్ట పోలీసులు కలిసి జగత్ గిరి గుట్టలోని రోడ్డు నెంబర్ 1లో జయశ్రీ ట్రేడర్స్ (కిరాణా దుకాణం)లో సోదాలు నిర్వహించి దుకాణంలో అమ్ముతున్న 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్‌లు(26 కేజీలు) మరియు 4 కేజీల గంజాయి పొడిని స్వాధీనం చేసుకుని దుకాణ యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

విచారణలో - గంజాయి చాక్లెట్స్ & గంజాయి పొడిని కొలకత్తాకు చెందిన మోహన్ అనే వ్యాపారి కొలకత్తా నుండి రెగ్యులర్ గా సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 👉🏻 ఒక ప్యాకెట్లో 40 చాక్లెట్లు. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 1,000/-. ఒక్కో చాక్లెట్ ధర రూ. 40/-. 160 ప్యాకెట్లలోని 6,400 చాక్లెట్లు ధర రూ. 2,56,000/-.

 👉🏻 4 కేజీ ల గంజాయి పొడి ధర @ రూ. 10,000/-.

 వివరాలు ఇలా ఉన్నాయి..
1). మనోజ్ కుమార్ అగర్వాల్ S/o బన్షీదర్ అగర్వాల్, వయస్సు 54, Occ కిరాణా షాప్, అంజయ్య నగర్, జగత్గిరిగుట్ట, బాలానగర్ N/o అసాన్ సోల్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్(పెడ్లర్)

2). మోహన్ N/o కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ (ప్రధాన సరఫరాదారు - పరారీలో ఉన్నాడు)

జప్తు చేసిన వాటి వివరాలు..

1). గంజాయి చాక్లెట్లు - 160 ప్యాకెట్లు (26 కేజీలు)
2). గంజాయి పొడి - 4 కేజీలు,

మొత్తం విలువ రూ.2,66,000/-
కేసును జగత్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.