Dr BRA Konaseema: ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు మండలం గాడిమొగ గ్రామoలో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి సుబ్బరాజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమoలో భాగంగా నిన్న విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో పై హర్షంతో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్ధి సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి అన్ని వర్గాల వారిని ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పధకాలు పేదల పాలిట వరాలు అని రైతులకు, మహిళలకు, యువతకు మేనిఫెస్టో లో పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్ధి సుబ్బరాజు ఇంటింటా తిరిగి రాబోయే కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.
వికలాంగులకు మానవరూపంలో ఉన్న దేవుళ్లు...
వికలాంగులకు మానవరూపంలో ఉన్న దేవుళ్లు చంద్రబాబు, పవన్, మోదీలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు.
దివ్యాంగులకు ఇచ్చే ఫిక్షన్ 100 శాతం ఉంటే రూ.15,000లు, మిగిలిన వారికి రూ. 6,000 ఇస్తామంటూ ఎన్డీయే ఎన్నికల మ్యినిఫేస్టోలో పెట్టడంపై వికలాంగులు, టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పాలనలో వికలాంగులకు అన్యాయం తప్ప, న్యాయం జరగలేదని, ఇకనైనా వైకాపా పార్టీకి అందరూ బుద్ది చెప్పాలని వికలాంగులకు పిలుపునిచ్చారు.