కాజులూరులో అనుమతులు లేకుండా ఏదేచ్చేయగా మట్టి తవ్వకాలు
కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం తాహశిల్దార్
కాజులూరు మండలం, BCN రిపోర్టర్ దొరబాబు: నిబంధనలకు విరుద్ధంగా కాజులూరు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా దారులు నల్ల బంగారాన్ని కొల్లగొడుతూ సొమ్ములు చేసుకుంటున్నారు. గతవారం రోజులు నుంచి మండలంలో పలుచోట్ల ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంత సంబంధిత శాఖ అధికారులు మౌనంగా ఉండటంపై మండలంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ తతంగం అంతా స్థానిక రెవెన్యూ అండదండలతోనే కొనసాగుతోందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే స్థానిక రెవెన్యూ సిబ్బంది తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి రహదారిపై యదేచ్ఛగా వెళుతున్న ట్రాక్టర్లులకు నామమాత్రపు పైన్ విదించి చేతులు దులుపుకున్నారు. మట్టిని తవ్వకాలు జరిపే చోట ప్రొక్లేన్లు ప్రత్యేకంగా కనిపించినా వాటిపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.
మండలానికి చెందిన బందనపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో ఒకచోట భారీఎత్తున మట్టి తవ్వకాలు జరుపుతున్నా అదికారులు ఉదాశీనతో చూచి చూడనట్లు వ్యవహరించడంతో పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా తోలకాలుజరుగుతున్నాయి. అక్రమ మట్టి తవ్వకాలపై ప్రజలు ఆందోళన చెందడంపై క్రిందిస్థాయి రెవిన్యూ సిబ్బంది తనిఖీ చేసినా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా పలుకుబడితో అక్రమ మట్టి తవ్వకాలను పగలు నిలిపివేసి రాత్రులు మళ్ళీ తోలకాలు ప్రారంభించారు.
తాళ్లరేవుకు చెందిన వ్యక్తులు మతుకుమిల్లి గ్రామంలో ఎటువంటి అనుమతలు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి మే, జూన్ నెలల్లో ఈ మట్టి తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అలాకాకుండా నిత్యం సంవత్సరం పోడుగునా ఎదోచోట ఈతవ్వకాలు జరుగడం పరీపాటైయ్యింది. ఆమట్టిని ట్రాక్టర్లు, భారీ వాహనాల, ద్వారా బందలపూడి గ్రామం మీదుగా వెళుతున్నాయని రోడ్డుపై వెళ్తున్న స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు వృద్దులు ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అక్రమ మట్టి తవ్వకాలను ఆపుచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అనుమతులు తప్పనిసరి తాహశిల్దార్ శివకుమార్...
మండలంలో ఎవరైనా మట్టి తోలుకోదలచినా మైనింగ్ శాఖాధికారులు అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కాజులూరు తాహశిల్దార్ ఎల్ శివకుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు మండలంలో యదేచ్చగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఆయన్ని వివరణకోరగా.. మాట్లాడుతూ మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నాయని తన దృష్టికి రాలేదని, రహదారిపై ట్రాక్టర్లతో రవాణా అవుతుందన్న సమాచారంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ ని పంపించామని, మట్టితో వెళుతున్న ట్రాక్టర్లుకు పైన్ వేసిన తరువాత పంపుంచడం జరిగిందన్నారు. దీంతో స్పందించిన ఆయన సంబంధిత విఆర్ఓ, విఆర్ఓ లను సంఘటనా స్థలానికి పంపించి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబందనలు అతిక్రమించి తోలకాలు జరిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతోందని తాహశిల్దార్ ఈసంధర్బంగా హెచ్చరించారు.