సతీమణి కోసం చంద్రబాబు షాపింగ్.. పట్టుచీర ధరెంతో తెలుసా..?


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ సభ్యుల గురించి ఎక్కడా ఎక్కువగా ప్రస్తావించరు. వారి గురించి పెద్దగా ఆలోచించరు. మరీ ముఖ్యంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరికి కూడా కానుకలు, వెడ్డింగ్, బర్త్ డే గిఫ్ట్‌లు ఇచ్చిన సందర్భాలు తక్కువే. ఈవిషయాన్ని పలు ఇంటర్వూల్లో ఇద్దరూ చెప్పడం కూడా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీ సీఎం ఆయన సతీమణి కోసం ఓ పట్టుచీరను కొనుగోలు చేశారు. 


చేనేత స్టాల్‌ను సందర్శించిన చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కోసం ఓపికగా ఓ మంచి క్యాలిటీ పట్టుచీరను సెలక్ట్ చేశారు.  దానిని కొనుగోలు చేయడానికి కూడా కొంత సేపు బేరం ఆడారు. చేనేత స్టాల్ నిర్వహిస్తున్న వారు కూడా మహిళలే కావడంతో షాపు యజమాని చెప్పిన ధర కంటే కాస్త తక్కువకు బేరం ఆడి డబ్బులు చెల్లించి చీర తీసుకున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తన జీవిత భాగస్వామి కోసం వెచ్చించిన సమయం, డబ్బు విషయంలో చూపించిన శ్రద్ద చూసి అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈవీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీమతికి పట్టుచీర కొన్న సీఎం..
సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన గురించి అందరికి తెలిసిన విషయం ఏమిటంటే ఆయన మంచి పరిపాలనదక్షుడు, ముందుచూపున్న నేత, రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాల కోసం పాటుపడే నాయకుడు, రాజకీయాలు తప్ప వ్యక్తిగత జీవితానికి పెద్దగా సమయం కేటాయించని ఫక్త్ పొలిటిషియన్ అని చెప్పుకుంటారు. అది ముమ్మాటికి వాస్తమే. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబునాయుడు శనివారం మార్చి 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. 

అక్కడ చేనేత మహిళలు రూపొందించిన చీరలను డ్వాక్రా మహిళలు విక్రయించడానికి చేనేత బట్టల స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని చంద్రబాబు ప్రారంభించడమే కాకుండా అక్కడున్న పట్టుచీరలకు సంబంధించి రంగులు, ధరలు, నాణ్యత వంటి వాటి గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంలోనే ఓ సరదా సన్నివేశం అందర్ని ఆకట్టుకుంటోంది.