ఏలూరు/అగిరిపల్లి: నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో పలు కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుకు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
శుక్రవారం ఉదయం 10.40 ని.లకు హెలికాప్టర్ ద్వారా అగిరిపల్లి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర బి. సి. సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి, నూజివీడు బ్రాండ్ అయిన మామిడిపండ్ల బుకే లు అందించి స్వాగతం పలికారు.
అనంతరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, డా. కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏలూరు రేంజి ఐజి జి.వి.జి. కిషోర్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ రాజ్, కావు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారావు, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు, ఘంటా మురళి రామకృష్ణ, పీతల సుజాత, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ప్రభృతులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
ఫోటో గ్యాలరీ..