ANDHRAPRADESH:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దమైంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం వారంట్ కోరుతూ కోర్టులో సిట్ అధికారులు పిటీషన్ దాఖలు చేసారు. ఇప్పటికే హైకోర్టు మిథున్ ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేసింది. దీంతో, మిథున్ సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ వాదనల తరువాత మిథున్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఇదే సమయం లో కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ దక్కకపోవటంతో.. ఇక, ఏ క్షణమైనా మిథున్ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టులో ఊరట దక్కకపోవటంతో.. మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో మిథున్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ ఇప్పటికే సిట్ దర్యాప్తునకు మిథున్ సహకరిస్తున్నారని.. విచారణకు హాజరయ్యారని వివరించారు. ప్రభుత్వం తరపు ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. కాగా.. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ దాఖలు పైన సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
విచారణకు సహకరిస్తున్న సమయంలో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ తరపు న్యాయవాది కోరారు. కాగా, న్యాయస్థానం మాత్రం మిథున్ ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేసింది. ఇదే సమయంలో సిట్ వారెంట్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో ఇక మిథున్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. లిక్కర్ కేసులో మిధున్ సరెండర్ కు సమయం కావాలని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంను కోరగా.. టేక్ యువర్ టైం అని ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తా రంటూ చర్చ జోరందుకుంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే సమాచారం కోసం సిట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సమయంలో మిథున్ అరెస్ట్ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi