ఏపీ ప్రభుత్వం శుభవార్త.. మూడు నెలలకోసారి తల్లిదండ్రుల అకౌంట్లోకి డబ్బులు


ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించటానికి సిద్ధమైన ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి రవాణా భత్యాన్ని చెల్లించేలా ప్లాన్ చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి ఆ డబ్బులు పడేలాగా ప్రణాళికలు రచిస్తోంది.

విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ

ANDRAPRADESH:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది. ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించటానికి సిద్ధమైన ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి రవాణా భత్యాన్ని చెల్లించేలా ప్లాన్ చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి ఆ డబ్బులు పడేలాగా ప్రణాళికలు రచిస్తోంది.

విద్యార్థులకు రవాణా చార్జీలు 

రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 79వేల మందికి రవాణా భత్యాన్ని ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, ఇళ్ళ నుండి బడి దూరంగా ఉన్నవారు ఒకటి నుంచి ఐదవ తరగతిలో ఉండే ప్రాథమిక పాఠశాల ఇంటికి కిలోమీటర్ కంటే ఎక్కువదూరం ఉన్నవారు, 6, 7, 8తరగతుల పాఠశాలలు మూడు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్న ఒక్కో విద్యార్థికి నెలకు 600రూపాయలు చొప్పున రవాణా భత్యాన్ని చెల్లించాలని నిర్ణయించింది.

రవాణా చార్జీల్లో కేంద్రం వాటా మంజూరు 

ఇక ఈ రవాణా చార్జీలను కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తుంది. ఇప్పటికే 2025 26 విద్యా సంవత్సరానికి కేంద్రం తన వాటాగా 47. 91 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మిగతా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కలిపి విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు విద్యార్థుల జాబితాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.

మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల ఖాతాలలో రవాణా చార్జీలు 

అయితే ప్రతి సంవత్సరం సంవత్సరాంతంలో ఒకేసారి తల్లిదండ్రుల ఖాతాలో ఈ డబ్బులను జమ చేస్తారు కానీ ఈ సంవత్సరం నుంచి మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల ఖాతాలో ఈ డబ్బులను జమ చేస్తే వారికి ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది సంస్కరణల్లో భాగంగా పాఠశాలల హేతుబద్దీకరణ చేసింది. ఇందులో భాగంగా కొన్ని పాఠశాలలను అవసరం మేరకు మార్చవలసి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 79860 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు 

ఈ క్రమంలో విద్యార్థులు కొంచెం దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 79860 మంది విద్యార్థులు స్కూల్స్ కి వెళ్లాలంటే బస్సుల ద్వారానో, ఆటోల ద్వారానో, లేదా ద్విచక్ర వాహనాల పైన ప్రయాణం చేయాలి . ఇక వీరందరికీ రవాణా చార్జీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో త్వరలోనే వీరి తల్లిదండ్రుల ఖాతాలలో ప్రభుత్వం రవాణా చార్జీలను వేయనుంది.

విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా రవాణా చార్జీలను పొందే విద్యార్థులు ఎక్కువగా నెల్లూరు జిల్లాలో 12951 మంది ఉంటే అత్యల్పంగా గుంటూరు జిల్లాలో 437 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం రవాణా చార్జీలను మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల ఖాతాలలో వేయాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now