మహిళా కమీషన్ వద్దకు రోజా.. నగరి ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్


ANDHRAPRADESH:మాజీ మంత్రి రోజా పైన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే రోజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక వైసిపి నేతలు కూడా రోజాపై భాను ప్రకాష్ అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో వైసిపి మహిళా నేతల పైన ఈ తరహా వేధింపులు కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా కమీషన్ కు రోజా ఫిర్యాదు

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక ఇప్పటికే తన పైన నగరి ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజా, పోలీసులు పట్టించుకోకపోవడంతో మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. జాతీయ మహిళా కమిషన్ కు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కు రోజా ఫిర్యాదు చేశారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న టిడిపి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని ఆమె కమిషన్ ను కోరారు.

టిడిపి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రోజా పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ మహిళానేతలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా వైయస్సార్సీపి స్టేట్ మహిళావిభాగం సెక్రెటరీ కొర్ల శిరీష మాట్లాడుతూ మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని గాలి భాను ప్రకాష్ ఎమ్మెల్యే పదవికి ఏమాత్రం అర్హుడు కాదని మండిపడ్డారు.

నోటికొచ్చినట్లు అవమానించడం ఆయన అహంకారానికి ప్రతీక 

మాజీ మంత్రి రోజాను ఆయన నోటికొచ్చినట్లు అవమానించడం ఆయన అహంకారానికి ప్రతీక అని విరుచుకుపడ్డారు. గాలి భాను ప్రకాష్ పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టిడిపి మహిళలను ఇన్సల్ట్ చేస్తుందని, ఈ విధంగా అవమానించడం అధికార పార్టీకి ఏ విధంగా సమంజసమో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నీతులు చెప్తారా... లేదా మీ కూటమి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా? వైసీపీ సూటి ప్రశ్న అంతేకాదు నగరి పోలీస్ స్టేషన్ లో భాను ప్రకాష్ పై రోజా ఫిర్యాదు చేశారని, అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యే భాను ప్రకాష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నగరి సీఐ విక్రమ్ కు రోజా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. మళ్లీ నీతులు చెప్తారా... లేదా మీ కూటమి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా అంటూ చంద్రబాబును, హోం మంత్రి వంగలపూడి అనితను, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now