డ్ర*గ్స్ బ్యాచ్ తో కేటీఆర్ కు అనుబంధం ఉందన్న మాటలు పాతవే. తాజాగా మాత్రం ఏపీ మంత్రి నారా లోకేశ్ తో కేటీఆర్ రహస్యంగా ఎందుకు భేటీ అయినట్లు? అన్న విషయాన్ని ప్రశ్నించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారు.
HYDERABAD:సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. అంతకు మించిన అన్న రీతిలో ఢిల్లీలోని తన నివాసంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్ర*గ్స్ బ్యాచ్ తో కేటీఆర్ కు అనుబంధం ఉందన్న మాటలు పాతవే. తాజాగా మాత్రం ఏపీ మంత్రి నారా లోకేశ్ తో కేటీఆర్ రహస్యంగా ఎందుకు భేటీ అయినట్లు? అన్న విషయాన్ని ప్రశ్నించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారు.
కేటీఆర్ - లోకేశ్ మధ్య స్నేహం పాతదే. చంద్రబాబు అరెస్టు వేళ.. తనకు లోకేశ్ ఫోన్ చేశారంటూ ఎన్నికల వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఆ సందర్భంగా ఆయన బయటపెట్టిన అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. కష్టంలో ఉన్న వేళలో ఫోన్ చేసిన విషయాల్ని సైతం తాము ఎంత శక్తివంతులమన్న విషయాన్ని ప్రజలకు చాటి చెప్పాలా? ఆ మాత్రం గోప్యత ఉండదా? లాంటి ప్రశ్నలు కేటీఆర్ కు ఎదురయ్యాయి.
చంద్రబాబును ఆయన కుటుంబాన్ని అదే పనిగా విమర్శించటం.. అవసరమైన ప్రతిసారీ తెలంగాణకు బూచీలా చూపించే కేటీఆర్ అండ్ కోకు లోకేశ్ ఫోన్ చేయటం ఎందుకన్న వ్యాఖ్య కూడా వినిపించింది. ఇదంతా పక్కన పెడితే.. లోకేశ్ తో కేటీఆర్ భేటీ జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఆ విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచినట్లు? అన్నది ప్రశ్న. తరచూ ఆంధ్రా పాలకులు.. ఆంధ్రాలోని చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకుంటారన్న ఆరోపణను సంధిస్తున్న నేతలతో లోకేశ్ ఎందుకు భేటీ అయినట్లు? ఒకవేళ భేటీ అయినా రహస్యంగా ఎందుకు ఉంచినట్లు?లాంటి ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.
లోకేశ్ - కేటీఆర్ రహస్య భేటీ అంశాన్ని సీఎం రేవంత్ రివీల్ చేసిన వేళ ఆయనకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ రహస్య భేటీ మీకెలా తెలిసింది? మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? అంటూ ఒక మీడియా ప్రతినిధి అడగాల్సిన విధంగా అడిగేశారు.దీనికి స్పందనగా ముఖ్యమంత్రి రేవంత్ చాలా చతురతతో సమాధానం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అవసరం ఏముంది.. వాళ్ల పార్టీ వాళ్లే చెబుతున్నారంటూ అసలు విషయాన్ని ఓపెన్ చేసేశారు. ఇంతకూ సీఎం రేవంత్ చెప్పినట్లే.. లోకేశ్ తో కేటీఆర్ భేటీ అయ్యారా? ఒకవేళ అయితే ఎప్పుడు? ఎందకు? ఎజెండా ఏమిటి? లాంటి ప్రశ్నలకు కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi