కూటమి నేతలకు శుభవార్త.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ


ANDHRAPRADESH:ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి భారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, ఏఎంసీలలో జనసేనకు 9, బీజేపీ పార్టీకి చెందిన నేతలకు 4 స్థానాలు కేటాయించింది. 66 చైర్మన్ పదవుల్లో 17 మంది బీసీలకు, 10 ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనారిటీలకు చోటు కల్పించింది. 66 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నామినేటెడ్‌ పదవులను సీఎం చంద్రబాబు తాజాగా భర్తీ చేశారు. 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లలో జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు ఇచ్చారు. ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో 17 బీసీలకు, 10 ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయింపులు జరిగాయి. అలాగే ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనార్టీలకు అవకాశం లభించింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవుల్లో 35 మంది మహిళలకు అవకాశం దక్కింది

మరోవైపు ఏపీ మత్స్య కార అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొల్లు పెద్దిరాజును నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల పాటు పెద్దిరాజు ఛైర్ పర్సన్ పదవిలో కొనసాగనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా నరసాపురం నియోజకవర్గానికి చెందిన కొల్లు పెద్దిరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now