ANDHRAPRADESH:మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న ఏపీ మంత్రి కేటీఆర్ తో తన సమావేశం పైన క్లారిటీ ఇచ్చారు. బనకచర్ల పై చంద్రబాబు ప్రతిపాదనల కు రేవంత్ ఆమోదం తెలిపారని ఆరోపించారు. ఏపీ మంత్రి ఒక విధంగా.. రేవంత్ మరో విధంగా స్పందించటం ఏంటని ప్రశ్నించారు. గోదావరి జలాలను ఏపీకి అప్పగించాలని చూస్తే మరో పోరా టం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసారు.
ఏపీ మంత్రి నారా లోకేష్‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు సార్లు కలిసారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఢిల్లీలో మీడియా చిట్ ఛాట్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అర్ద్రరాత్రి లోకేష్ - కేటీఆర్ మీటింగ్ ఏంటని ప్రశ్నించారు. దీని పైన తాజాగా కేటీఆర్ స్పందించారు. తాను ఏపీ మంత్రి లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి? అని ప్రశ్నించారు. లోకేష్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. లోకేష్‌ను అర్ధరాత్రి కలవా ల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేవంత్ ప్రెస్‌మీట్‌కు యువత దూరంగా ఉండాలను సూచించారు. దుబాయ్ లో ఎవరో చనిపోతే తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తన పైన చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి పరీక్షకు అయినా సిద్దమని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్‌లా తాను దొంగను కాదని.. సంచులు మోయలేదని సెటైరికల్ పంచ్ వేశారు. బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి.. ఢిల్లీలో కలిసి దొరికారని విమర్శించారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పి్చి మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించ డం లేదా? అని ప్రశ్నించారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతా అని అన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi