ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. క్రమంగా కేంద్రం అజెండాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోన్నట్టే కనిపిస్తోంది.
ప్రత్యేకించి- హిందీ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే హిందీ ప్రాధాన్యతను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వివరించిన విషయం తెలిసిందే. దీన్ని పెద్దమ్మగా అభివర్ణించారాయన.
ఇప్పుడు తాజాగా- మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీన్ని జాతీయ భాషగా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని లింక్ భాషగా పరిగణిస్తోన్నారని అన్నారు.
ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడారు నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తోన్నారని అన్నారు. ఇది- హిందీ గురించి మాత్రమే కాదని, జపనీస్, జర్మన్, ఇతర భాషలను కూడా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
భారతీయులు లింక్ లాంగ్వేజ్‌గా హిందీని అనుసరిస్తోన్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. హిందీని నేర్చుకోవడంలో తనకు ఎలాంటి తప్పు కనిపించట్లేదని వ్యాఖ్యానించారు. హిందీని నేర్చుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో సులభంగా మనుగడ సాగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఆ పని చేసిన కోటా శ్రీనివాసరావు ..!
"కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఆ పని చేసిన కోటా శ్రీనివాసరావు ..! "
ఇంగ్లీష్ తో పాటు జాతీయ, ప్రాంతీయ భాషలకు నేర్చుకోవడం ద్వారా దేశ సంస్కృతిని సమష్టిగా సుసంపన్నం చేసుకోవవచ్చని, ఆ అవసరం కూడా ఉందని నారా లోకేష్ అన్నారు. హిందీని నేర్చుకోవడం తప్పు కాదని, ఈ విషయంలో వివాదం తలెత్తడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు.