ANDHRAPRADESH:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. లిక్కర్ స్కాం లో చాలా రోజులుగా మిథున్ రెడ్డి పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిట్ విచారణకు మిథున్ హాజరయ్యారు. కాగా, ఈ కేసులో తాజాగా హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ కావటంతో సిట్ వేగం పెంచింది. ఎంపీ విదేశాల వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వైసీకి చెందిన పలువురు ఈ కేసు లో అరెస్ట్ అయ్యారు. కాగా, మిథున్ విషయంలో సిట్ ఇప్పుడు ఏం చేయబోతుందనేది కీలకంగా మారుతోంది.
లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ పైన సిట్ పట్టు బిగిస్తోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీ షన్ తిరస్కరించటంతో.. ఇప్పుడు లుకౌట నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కోర్టులో జరిగిన వాదనల్లో ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చార ని, దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని లూథ్రా కోర్టుకు వివ రించారు. ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర గురించి ప్రస్తావించారు. మిథున్ రెడ్డి తన ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.
మిథున్ పైన ఉన్న కేసుల గురించి చెప్పుకొచ్చారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరడంతో కోర్టు మిథున్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. మరోవైపు మిథున్ రెడ్డి తర పున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టుకు వివరించారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి కోరారు. మిథున్ రెడ్డి ముందుస్తు బెయిల్ ను కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో.. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో సిట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు పలువురిని విచారించింది. ముఖ్యులు అరెస్ట్ అయ్యారు. కాగా, మిథున్ విషయంలో తదుపరి అడుగులు ఈ కేసులో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.