కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాను క్యాబినెట్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని - ప్రజా సంఘాలు, దళిత సంఘాలు. డిమాండ్



మానవ హక్కుల ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క్యాబినెట్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని - ప్రజా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ 

రామచంద్రపురం/డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా/(బీసీఎన్ రిపోర్టర్ దొరబాబు): మానవ హక్కుల ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క్యాబినెట్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రామచంద్రపురం మెయిన్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.                                                                                 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ రామచంద్రపురం డివిజన్ కన్వీనర్ నూకల బలరాం, పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్దు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం తన జీవితాంతం కృషి చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని దేశ పార్లమెంట్ సాక్షిగా అవమానించినందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే క్యాబినెట్ పదవి నుండి తొలగించాలని, అయన దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి భీమ్ శంకరం, రామచంద్రపురం సిపిఐ పార్టీ నాయకులు ప్రేమానందం, శారద, రైతు కూలీ సంఘం నాయకులు అంబటి కృష్ణ, బాబ్జి రాజారెడ్డి, ఆటో యూనియన్ నాయకులు సత్తిబాబు రమేష్ సాయి తదితరు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..