సింగపూర్‌లో హై అలర్ట్.. హాంకాంగ్‌లో మరణ మృదంగం.. కరోనా మళ్లీ వస్తుందా?


WROLD NEWS: ప్రపంచం నుంచి కరోనా అంతరించిపోయిందా? ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 అంతమైందని అనుకుంటే అది మన పొరపాటే. By:  BCN TV NEWS 2020 నుంచి 2022 వరకు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు ఎండెమిక్‌గా మారింది. ఇది ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోతుందనే అవకాశం లేదు. ఇతర ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ప్రజలు కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కరోనా అయిపోయిందని అనుకునే వారికి ఇది హెచ్చరిక లాంటి పరిస్థితి. 


హాంకాంగ్ నుంచి సింగపూర్ వరకు కరోనా కొత్త వేవ్ మొదలైంది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ మే నెలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక్క హాంకాంగ్‌లోనే గత వారం, మే 3తో ముగిసిన వారాంతంలో కరోనా ఇన్ఫెక్షన్‌తో 31 మంది మరణించారు. హాంకాంగ్, సింగపూర్‌లలో హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. 

హాంకాంగ్‌లో పెరిగిన కరోనా కేసులు ప్రపంచం నుంచి కరోనా అంతరించిపోయిందా? ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 అంతమైందని అనుకుంటే అది మన పొరపాటే. ప్రపంచంలో మరోసారి కరోనా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఆసియాలో కరోనా వైరస్ మెల్లగా తన ఉనికిని చాటుతోంది. హాంకాంగ్ నుంచి సింగపూర్ వరకు కొత్త కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇక్కడ కోవిడ్-19 కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య అధికారులను కలవరానికి గురిచేస్తోంది. కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల అనేది ఆసియా అంతటా కోవిడ్ కొత్త వేవ్ సంకేతం. 
 
సింగపూర్‌లో హై అలర్ట్ కరోనాను దృష్టిలో ఉంచుకుని సింగపూర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏడాదిలో మొదటిసారి కరోనా కేసులకు సంబంధించి అప్‌డేట్ విడుదల చేసింది. మే నెలలో కరోనా కేసులు 28 శాతం వరకు పెరిగాయని అందులో పేర్కొంది. గత వారంతో పోలిస్తే ఈ వారంలో 14,200 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో చేరే కరోనా రోగుల సంఖ్య కూడా 30 శాతం వరకు పెరిగింది. అయితే, కొత్త వేరియంట్‌లు మునుపటి వేరియంట్‌ల కంటే ఎక్కువ అంటువ్యాధి లేదా ప్రాణాంతకమైనవని చెప్పడానికి ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లేవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ కొత్త సబ్-వేరియంట్ JN.1 కరోనా కొత్త సబ్ వేరియంట్ JN-1, BA.2.86 వెర్షన్ సంతానం. ఈ వేరియంట్ దేశానికి కొత్తదే అయినప్పటికీ ప్రపంచంలో దీని కేసులు ఇదివరకే వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దీని మొదటి కేసు ఈ ఏడాది జనవరి ప్రారంభంలో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇది అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు, సింగపూర్, చైనా, ఇప్పుడు భారతదేశంలో కనిపిస్తోంది.