డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ కు విద్యుత్ శాఖ శాఖ ఇచ్చింది. ఆయన ఇంటికి ఈ నెల రూ. 15,14,993 బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై తన గోడు వెళ్లబోసుకుంటున్నారు.
సాధారణంగా ప్రతి నెల రూ.1200-రూ.1300 వరకే బిల్లు వచ్చేదని.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 15 లక్షలకు పైగా బిల్లు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇది సాఫ్ట్‌వేర్ లోపమా లేక డిజిటల్ మీటర్ల వైఫల్యమో తెలియడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు నయం చేయాలని కోరుతున్నారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఇంటికి ఒక నెలకు రూ.6,75,000 కరెంట్ బిల్లు వచ్చింది. విషయం బయటపడిన తర్వాత అధికారులు తప్పిదంగా గుర్తించి సవరించారు.
కర్నూలు జిల్లాలో ఓ చిన్న చాయ్ హోటల్‌కు రూ.2 లక్షల బిల్లు వచ్చింది.
ఇటీవల విశాఖపట్నంలో ఓ పెన్షన్ దారుడికి సాధారణంగా రూ. 900 వచ్చే బిల్లు ఈసారి రూ. 85,000గా రావడంతో హాట్ టాపిక్ అయ్యింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi