HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు మార్కెట్లో సన్న బియ్యం ధరలు తగ్గేలా చేశాయి. గతంలో క్వింటా అయిదు వేల నుంచి ఆరువేల మధ్య పలికిన ధరలు ప్రస్తుతం భారీగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర 4000 రూపాయల నుంచి 4500 మధ్య అమ్ముడవుతున్న పరిస్థితి ఉంది.
సన్నబియ్యం ధరల తగ్గుదల.. కారణం సీఎం రేవంత్
ఇక సన్నబియ్యం ధరలు బాగా తగ్గడానికి సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సన్నరకం వడ్లపైన 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో సన్నబియ్యం సాగు చేసిన వారి సంఖ్య బాగా పెరిగింది. సన్నబియ్యం సాగు విస్తీర్ణం దాదాపుగా గతంతో పోల్చుకుంటే రెట్టింపయింది. ఎక్కువగా సన్న బియ్యం సాగు చేయడం వల్ల పెద్దగా సన్నబియ్యం కొనుగోలు చేస్తున్న దాఖలాలు మార్కెట్లో కనిపించడం లేదు.
రేషన్ షాపుల్లో మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ కి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో గత కొద్ది నెలలుగా సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ఇక ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని, అదికూడా సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో సన్న బియ్యం కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత తగ్గింది.
మార్కెట్ లో పడిపోయిన సన్నబియ్యం ధరలు
ఫలితంగా మార్కెట్లో ధరలు బాగా పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు 17349 రేషన్ షాపుల ద్వారా మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంతో, ఈ భారీ పంపిణీతో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం డిమాండ్ బాగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలోని సన్నబియ్యం వాడకం తగ్గింది అంటే, గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న డిమాండ్ కూడా ప్రస్తుతం పడిపోయింది.వదిలిపెట్టేది లేదు..
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం ధరల తగ్గుదల రిలీఫ్
తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి సన్నబియ్యం ఆర్డర్లు తెలంగాణ రాష్ట్రానికి బాగా తగ్గడం వల్ల కూడా సన్న బియ్యం ధరలు పడిపోయాయి. జూన్ నుంచి క్రమంగా బియ్యం ధర తగ్గుతున్న పరిస్థితి ఉంది .ఇక సన్న బియ్యం ధరలు మార్కెట్లో తగ్గడం సామాన్య మధ్య తరగతి ప్రజలకు కాస్త రిలీఫ్ ని ఇస్తున్నాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi