వైసీపీ గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. జగన్ చిత్తూరు టూర్ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ANDHRAPRADESH:వైసీపీ గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. జగన్ చిత్తూరు టూర్ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లిక్కర్ స్కాం విషయంలో సిట్ దూకుడు పెంచేసింది. దాంతో పాటుగా ఒక సీనియర్ ఎంపీని వైసీపీకి వెన్నెముకగా ఉన్న నాయకుడిని జగన్ కోటరీలో అతి ముఖ్యుడిని అయిన మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా వైసీపీ షాక్ లోకి వెళ్ళిపోయింది. వైసీపీకి ఇటీవల కాలంలో వచ్చిన ఎంతో కొంత అనుకూలత కాస్తా ఈ పరిణామంతో మారిపోయింది అని అంటున్నారు.
ఆ ప్రచారంలో ఆందోళన
మరో వైపు చూస్తే ఏకంగా వైసీపీ అధినేత జగన్ అరెస్టు అవుతారు అన్న ప్రచారం ఊపందుకుంది. ఆ మాట సిట్ చెప్పడం లేదు కానీ కూటమికి చెందిన నాయకులు పెద్ద వారే మాట్లాడుతున్నారు. ఒక వైధంగా వైసీపీని సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టడానికా నిజంగా అదే జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. అయితే ఈ ప్రచారంలో చూస్తే నిజం కూడా ఉందని అది జరిగి తీరుతుందని కూటమి నేతలు అంటున్నారు. మిధున్ రెడ్డి అరెస్టు తో ఏపీ రాజకీయాల్లో టీడీపీ కూటమి పై చేయి సాధిస్తే వైసీపీలో నిండా ఆందోళన మొదలైంది.
ఆపరేషన్ స్టార్ట్ అయినట్లేనా
ఈ నేపధ్యంలో బెంగళూర్ వేదికగా గత వారమంతా సుదీర్ఘ మంతనాలు జరుపుతున్న జగన్ సరికొత్త ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు. అదేంటి అంటే కూటమిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలను ఆకర్షించడం ద్వరా వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చూడడం అంటున్నారు. ఎమ్మెల్యేలు కీలక పదవులలో ఉన్న వారు అయితే కూటమికి మరో నాలుగేళ్ళ అధికారం ఉంది కాబట్టి బయటకు రారు కానీ ఏ పదవులూ లేక నలిగిపోతున్న వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు. వారిలో కొందరితో మంతనాలు వైసీపీ నేతలు జరుపుతున్నారు అని అంటున్నారు. అలా కనుక వస్తే వారికి పెద్ద పీట వేస్తామని రానున్నది వైసీపీ ప్రభుత్వమే అని చెబుతున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ నుంచి కీలక నేతలు
ఇక కాంగ్రెస్ ఏపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంది అని అంటున్నారు. ఆ పార్టీకి షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక మరింతగా నైరాశ్యం కమ్ముకుందని అంటున్నారు. షర్మిల ఏపీలో ఎన్డీయే సర్కార్ కంటే కూడా జగన్ మీదనే విమర్శలు ఎక్కుపెట్టడంతో సీనియర్లకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది అని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ కి ఎన్డీయే ప్రధాన ప్రత్యర్ధి అయితే ఏపీలో మాత్రం జగన్ ని ఆమె ఎంచుకోవడంతో సీనియర్లకు ఏమీ పాలుపోవడం లేదు అని అంటున్నారు. ఇక ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ వైసీపీలోకి వచ్చారు. ఇపుడు అదే వరసలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక బడా నాయకుడు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరుతారు అని అంటున్నారు.
వీరంతా రెడీనట
అంతే కాదు రాయలసీమకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో సైతం మంతనాలు జరుపుతున్నారు అని అంటున్నారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి క్రిష్ణ మోహన్ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇలా కనీసం ఒక మంచి నంబర్ తో కాంగ్రెస్ టీడీపీల నుంచి నేతలను చీర్చుకోవాలని వైసీపీ అయితే స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు.
ముహూర్తం కుదిరిందా
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కి వైసీపీ ఒక ముహూర్తం పెట్టిందని అంటున్నారు. ఆగస్టు నెల 15న కాంగ్రెస్ టీడీపీల నుంచి కీలక నేతలను చేర్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ విధంగా భారీ ఎత్తున నేతలు కనుక వైసీపీలో చేరితే పార్టీకి ఒక బూస్ట్ వస్తుందని ఏపీలో కూడా రాజకీయంగా పైచేయి సాధించినట్లు అవుతుందని అధినాయకత్వం అంచనా వేస్తోంది అని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ప్రచారం కనుక నిజం అయితే వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.