తల్లికి వందనంపై ఆగని విమర్శలు..! సర్కార్ సీరియస్ వార్నింగ్ ..!


ANDHRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా ఈ ఏడాది మంచి మార్కులే సంపాదించుకుంది. గతంలో అమ్మఒడి పేరుతో జగన్ అమలు చేసిన పథకానికి మెరుగులు దిద్ది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి 13 వేల చొప్పున ఇచ్చేలా దీనికి మార్పులు చేశారు. గతేడాది అమలు చేయలేకపోయినా ఈ ఏడాది దాదాపు 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేసింది కూటమి సర్కార్. అయితే ఇంత చేసిన ఓ విషయంలో మాత్రం విమర్శలు తప్పడం లేదు.

రాష్ట్రంలో లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా 9, 10, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు చదువుతున్న ఎస్సీ విద్యార్ధులు 3.93 లక్షల మందికి ఈ పథకం పూర్తి స్దాయిలో అమలు కాలేదు. కేంద్రం నుంచి వచ్చే స్కాలర్ షిప్ మొత్తాల్ని మినహాయించి మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వీరికి జమ చేసింది. దీంతో విద్యార్ధులకు 5 వేల నుంచి 12 వేల రూపాయల మధ్య మొత్తాలే క్రెడిట్ అయ్యాయి. దీంతో వివాదం మొదలైంది.

తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ఎస్సీ విద్యార్ధులకు అమలు చేయకుండా మోసం చేసిందంటూ వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా హ్యాండిల్స్ లో వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలా తల్లికి వందనం పథకంలో మొత్తం డబ్పులు రాని వానికి 20 రోజుల్లో కేంద్రం విడుదల చేసే నిధులు జమ అవుతాయని, దీంతో మొత్తం 13 వేలు లభిస్తాయని వివరణ ఇస్తోంది. దీంతో కేంద్రం నిధులు వస్తాయో రావో తెలియక ఎస్సీ విద్యార్ధుల్లోనూ అయోమయం నెలకొంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now