ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు టీం సింగపూర్ పర్యటన కీలకంగా మారుతోంది. సీఎంతో పాటుగా ఏడుగురు ఏడుగురు సభ్యుల బృందం ఆరు రోజులపాటు అక్కడ పర్యటించనుంది. 2024 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలి సారి అమరావతి వెళ్తున్నారు. అమరాతి ప్రాజెక్టులో గతంలో సింగపూర్ కీలక పాత్ర పోషించింది. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టు బడులతో పాటుగా అమరావతి అంశాల పైన చర్చలు చేయనున్నారు. అమరావతి నిర్మాణం లో సింగపూర్ పాత్ర ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది. నవంబరులో విశాఖలో నిర్వహిం చే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఈ పర్యటనలో ఆహ్వా నించనున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు.
రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు సింగపూర్‌కి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం సింగపూర్ వెళ్లనుంది. 6 రోజుల పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో చంద్రబాబు బృందం భేటీ కాబోతుంది.
సింగపూర్ పర్యటన ద్వారా ఏపీ ఏపీని మరోసారి ప్రపంచవ్యాప్తం చేయడమే అసలు లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ పర్యటనలో ప్రవాసాంధ్రులతోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ లో చంద్రబాబు చర్చలు చేయను్నారు. వారిని అమరావతికి ఆహ్వానించనున్నారు.
జులై 27న 'వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్' డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో చంద్రబాబు బృందం సమావేశం అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగే ఈ సభలో విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయుల ముందు చంద్రబాబు తన ప్రణాళికను ఉంచను న్నారు. అమరావతి ప్రణాళికల్లో కీలకంగా వ్యవహరించిన అమరావతి తిరిగి ఇప్పుడు మాస్టర్ డెవలపర్ గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi