సిట్ దూకుడుతో మారుతున్న లెక్కలు..! జగన్ అనూహ్య నిర్ణయం..!

ANDHRAPRADESH:ఏపీలో మద్యం స్కాం దర్యాప్తులో సీఐడీ సిట్ విభాగం దూకుడు ప్రదర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న ఈ స్కాంలో కీలక నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపింది. అక్కడితో ఆగకుండా ఈ మొత్తం స్కాంకు కీలకమని చెబుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టుకు సంకేతాలు ఇస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మద్యం స్కాంలో తనకు అత్యంత సన్నిహితుడైన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం, తాజాగా భారతీ సిమెంట్స్ కార్యాలయాల్లో సిట్ దాడుల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ తిరిగి వచ్చే వారం తాడేపల్లికి తిరిగి రానున్నారు. ఇప్పటికే బెంగళూరులో మద్యం స్కాంపై న్యాయనిపుణులతో జగన్ సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

మద్యం స్కాంలో తన అరెస్టుపై సిట్ లీకులు ఇస్తున్న వేళ వచ్చే మంగళవారం వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీని జగన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 33 మందితో పునర్ వ్యవస్ధీకరించిన ఈ కీలక కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతోంది. మద్యం స్కాంలో సిట్ దూకుడుతో పాటు వైసీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దర్యాప్తు, భవిష్యత్తులో జగన్ వరకూ వస్తే ఏం చేయాలన్న దానిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

పైకి ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై చర్చ అని చెబుతున్నా అంతర్గతంగా మద్యం స్కాంపై సిట్ దూకుడుపైనే జగన్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయకర్తగా ఉన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకుని సిట్ వ్యవహరిస్తున్న తీరు, దీనిపై అటు కోర్టుల్లో, ఇటు ప్రజల్లోకి వెళ్లి దీటుగా స్పందించాల్సిన విధానంపై చర్చిస్తారు. అలాగే జగన్ అరెస్టు అయితే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలా వద్దా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలా చూసినా ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now